నీరుకుళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సీపీ
హనుమకొండ రూరల్, మే 15 (విజయక్రాంతి): ఆత్మకూర్ మండలం నీరుకుళ్ళ గ్రామంలో ఎర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు, ఇబ్బందులను పోలీస్ కమిషనర్ రైతులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుకోవడంతో, ధాన్యం తరలించేందుకుగా అవసరమైన లారీలు అందుబాటు లేక చాలా ఇబ్బందులకు గురౌవుతున్నట్లు రైతులు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుక పోవడంతో స్పందించిన సిపి లారీల సమస్యను జిల్లా కలెక్టర్,సంబంధిత అధికారుల దృష్టికి తీసుకపోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ రైతులకు బరోసానిచ్చారు.పోలీస్ కమిషనర్ వెంట ఆత్మకూర్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్, ధాన్యం కొనుగోలు కేంద్రం అధికారులు వున్నారు.






