సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు.మంగళవారం చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ సందీప్ కు వినతి పత్రం అందజేశారు.
సీఈసీ బీజేపీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని,ఓటర్ల జాబితాలో అక్రమాలపై స్పందించడం లేదని ఆరోపించారు. 2002 ప్రమాణిక నిబంధనతో ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వెంటనే తొలగించాలని, లేకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఈరి భూమయ్య, బాల్ మోహన్, కనకయ్య, మమత, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.