12 June, 2026 | 1:42 AM

క్రైమ్ కామెడీ చిత్రం ప్రారంభం

12-06-2026 12:39 AM

సాయి సోహన్, విస్మయశ్రీ, విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్ ఆరె మైసమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతోంది. దీన్ని క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు జీ మధుసూధన్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, పబ్లిసిటీ డిజైనర్లు అనిల్- ‘రోమాంచికం‘ చిత్ర దర్శకుడు వేణు గోపాల్‌రెడ్డి, చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; డీవోపీ: మహిరెడ్డి పండుగుల; ఎడిటర్: రవితేజ గిరిజాల; నిర్మాతలు: నిశాంక్‌రెడ్డి కుడితి, మహేందర్‌రెడ్డి తిగుళ్ల.