12 June, 2026 | 1:53 AM

యాక్షన్ మకుటం

12-06-2026 12:41 AM

హీరో విశాల్ కెరీర్‌లో ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్టుగా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. రవి అరసు అందించిన కథ ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలమ్స్ బ్యానర్‌పై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌నకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.

తాజాగా గురువారం మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను చూస్తే.. విశాల్‌ను మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం చూపించనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ అంజలి కూడా సరికొత్త మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్; ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్; ఆర్ట్: జీ దురైరాజ్.