12 August, 2026 | 9:25 PM

నిఘా నేత్రాలతో నేరాలను అరికట్టవచ్చు

12-08-2026 07:46 PM

 హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి

హుజురాబాద్,(విజయక్రాంతి): నిఘా నేత్రాలతో నేరాలను అరికట్టవచ్చని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సిపి గౌస్ అలం ఆదేశాల మేరకు బుధవారంపట్టణంలోని బుడగ జంగాల కాలనీ, వడ్డెర కాలనీలో కార్డెన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కార్డెన్ సెర్చ్ లో సరైన  ధృవీకరణ పత్రాలు లేని 100 వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, క్షణిక ఆవేశంలో ఎలాంటి తప్పులు చేయొద్దని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవద్దని తల్లిదండ్రులను కోరారు. స్మార్ట్ ఫోన్లతో ఇంస్టాగ్రామ్ లు ఓపెన్ చేసి పిల్లలు తప్పుదోవ పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేరాలను ఛేదించడం సులభం అవుతుందని అన్నారు. కా ర్డెన్స్ సెర్చ్ ద్వారా ప్రజల భద్రతతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్, పులి వెంకట్ గౌడ్, ఎస్ఐలు రవి, క్రాంతి కుమార్, తిరుపతి, ఏ ఏసైలు సంపత్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.