17 July, 2026 | 12:38 AM

భవిష్యత్‌లో సైబర్ నేరాలే సవాల్

17-07-2026 12:38 AM
  1. నాలుగింటిలో ఒకటి సైబర్ నేరమే
  2. ఎఐ, డేటా అనలిటిక్స్‌ను బలోపేతం చేయాలి
  3. సేఫ్ సిటీ ప్రాజెక్టుపై అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్

రంగారెడ్డి, జూలై 16(విజయక్రాంతి): సైబర్ నేరాలే భవిష్యత్తులో శాంతిభద్రతలకు అతిపెద్ద సవాల్‌గా మారనున్నాయని  డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. వీటిని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సైబర్ మోసాల వల్ల ఎన్నో కుటుంబాలు తమ జీవితకాల పొదుపును కోల్పోతున్నాయన్నారు. 2025లో సైబర్ మోసాల వల్ల రూ. 1,524 కోట్ల ఆర్థిక నష్టం, 2024తో పోలిస్తే నష్టాల తీవ్రతలో 20 శాతం తగ్గుదల, దేశవ్యాప్త నమోదైన సైబర్ ఎఫ్‌ఐఆర్‌లలో అత్యధికంగా 44 శాతం తెలంగాణలో నే నమోదయ్యాయన్నారు. ప్రతీ నాలుగు నే రాల్లో ఒకటి సైబర్ నేరం ఉంటుందన్నారు. పోలీసుల చొరవతో బాధితుల నిధుల రక్షణ రూ. 255 కోట్ల నుంచి రూ. 279 కోట్లకు పెరిగిందన్నారు.

అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), డేటా అనలిటిక్స్‌పై సైబర్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే బాధితు లు ‘1930’ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని ప్రజలకు సూచించారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు, మహిళల రక్షణపై డీజీపీ అధికారులతో మాట్లాడారు.