భావోద్వేగభరితంగా నాన్న కుట్టి
23-05-2026 12:00 AM
విజయ్ ఆంటోనీ హీరో గా నటిస్తూ, నిర్మాతగానూ వ్యవహరిస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. దర్శకుడు ము. మారన్ దీన్ని యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొంటోందీ సినిమా. ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందీ చిత్రబృందం.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ ఆంటోని ఇంటెన్స్ లుక్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రాఫర్, ఏ రాజా ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ ఆంటోనీ సంగీతం అందిస్తూ, ఎడిటర్‌గానూ వ్యవహరించారు.






