13 June, 2026 | 12:09 AM

14 రోజులు.. 11కోట్ల మంది భక్తులు!

27-01-2025 12:20 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళాకు  ప్రపంచ నలుమూల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 11కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలుస్తుంది. మౌనీ అమవాస్యను పురస్కరించుకుని ఈ నెల 29న భక్తులు భారీ మొత్తంలో తరలివస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.