పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం

26-04-2024 02:13:09 AM

l తెలంగాణను మొదటి నుంచి మోసం చేస్తోంది

l రాష్ట్రానికి నిధుల విడుదలలోనూ వివక్ష చూపుతోంది

l ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు

l ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటులోనూ మొండిచేయి

l నయవంచన పేరుతో బీజేపీపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణకు గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. మొదటి నుంచి రాష్ట్రాన్ని బీజేపీ పట్టించుకోలేదని పేర్కొంది. 1998లో తెలంగాణ ఇస్తామని కాకినాడ డిక్లరేషన్ చేసిన బీజేపీ 2000లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను మాత్రం పట్టంచులేదని తెలిపింది. బీజేపీ దేశంలో పదేళ్లు విధ్వంసం చేసిందని, ఈ మేరకు నయవంచన పేరుతో కాంగ్రెస్ రూపొందించిన చార్జ్‌షీట్‌ను గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. తెలంగాణను ఇస్తామని ఇవ్వకపోగా.. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణను ఎగతాళి చేశారని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఖమ్మం  జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 21 గ్రామాలను బలవంతంగా ఏపీలో విలీనం చేశారన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 2,400 మెగావాట్ల ఎన్‌టీపీసీ విద్యుత్ ప్లాంట్, గిరిజన, హార్టికల్చర్ వర్సిటీలతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీ ని బీజేపీ అమలు చేయలేదని ఆరోపించింది. 

నిధుల విడుదలలోనూ వివక్ష

రాష్ట్రానికి నిధుల విడుదల్లోనూ కేంద్రం వివక్ష చూపిందని కాంగ్రెస్ తన చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. పన్నుల రాబడిలో తెలంగాణ వాటాను 27 శాతానికిపైగా తగ్గించడమే కాకుండా కేంద్రానికి రాష్ట్రం రూపాయి పంపిస్తే తిరిగి 43 పైసలను మాత్రమే ఇస్తుందని పేర్కొంది. అదే ప్రతి రూపాయికి బీహార్‌కు రూ.706, యూపీకి రూ.273, అస్సాంకు రూ.2.63, మధ్యప్రదేశ్‌కు రూ.2.42 ఇస్తుందని తెలిపింది. తెలంగాణకు రావాల్సిన రూ.4 వేల కోట్ల జీఎసీ ్టపరిహారం, నీతి అయోగ్ సిఫార్సు చేసిన రూ.24,205 కోట్లు, వెనుబడిన జల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదని తెలిపింది. తెలంగాణకు 2024 బడ్జెట్‌లో బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ములుగు ట్రైబల్ వర్శిటీకి, నిజామాబాద్ పసుపు బోర్డుకు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. బీజేపీ మహా కుంభమేళాకు రూ.100కోట్లు విడుదల చేయగా సమ్మక్క సారక్క జాతరకు మాత్రం రూ.3.14 కోట్లను మాత్రమే విడుదల చేసిందన్నారు. తెలంగాణలో వరదలు వస్తే కూడా వివక్ష చూపిందని మండిపడ్డారు. 2020లో తీవ్ర వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైనా ఎటువంటి సాయం చేయలేదని తెలిపారు. 2023లో మహారాష్ట్రకు రూ.1,420.80 కోట్లు, ఒడిశాకు రూ.707.60 కోట్లు, బీహార్‌కు రూ.624 కోట్లు, గుజరాత్‌కు రూ.584 కోట్లను విడుదల చేసిందన్నారు.

రైతులు, పేదలు, యువతకు ధోకా..

కృష్ణా జలాలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను దక్కకుండా చేస్తూ రాష్ట్ర రైతులకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ పేర్కొంది. 2022లో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పి తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించింది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, బీడీఎల్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కారణంగా లక్షల ఉద్యోగులకు నష్టం కలిగించిందని తెలిపింది.

ప్రాజెక్టుల కేటాయింపులోనూ మోసం..

పాలమూరు సహా తెలంగాణలోని ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు బీజేపీ జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును బీజేపీ రద్దు చేయడంతో తెలంగాణకు 13.9 లక్షల ఉద్యోగాలు, రూ.2.19 లక్షల పెట్టుబడుల నష్టం కలిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌వరంగల్, హైదరాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్స్, ఫ్యాబ్ సిటీ, సీలేరు, పవర్ ప్రాజెక్టు, నారాయణపేట హ్యాండ్లూ మ్ పార్క్ ఏర్పాటు, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణలను గాలికి వదిలేసిందని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఒక్క విమానాశ్రయాన్ని గాని, డ్రై పోర్టు, పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయలేదన్నా రు. వరంగల్, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీలుగా తీర్చి దిద్దలేదన్నారు. మనోహర్‌బాద్ భద్రాచలంరోడ్‌ౌ సత్తుపల్లి, పెద్దపల్లి  మెదక్ మార్గాల్లో రైల్వే లైన్లు, సికింద్రాబాద్ ముద్ఖేడ్ రైల్వే లైను డబ్లింగ్, కాజీపేట విజయవాడ మార్గంలో మూడో రైల్వేలైన్ పనుల్లో బీజేపీ విఫలమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

విద్యాసంస్థల ఏర్పాటులో..

తెలంగాణకు ఒక్క ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్శిటీ మెడికల్ కాలేజీలనూ బీజేపీ ఏర్పాటు చేయలేదన్నారు. 2014 నుంచి ఒక్క జవహార్ నవోదయ విద్యాలయాన్ని కూడా తెలంగాణకు మంజూరు చేయలేదని, సైనిక్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో తెలంగాణ వివక్షకు గురైందని కాంగ్రెస్ తన చార్జ్‌షీట్‌లో పేర్కొం ది. అంతేకాకుండా దేశాన్ని మోదీ అమ్మేస్తున్నారని, రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభు త్వ ఆస్తులను కేవలం రూ.6 లక్షల కోట్లకే కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టారని పేర్కొం ది. మోదీ ప్రియమిత్రుడు, అదానీకి దేశంలోని 30 శాతం పోర్టులు,  ఎయిర్‌పోర్టులు, విద్యుత్, బొగ్గు నిల్వలను అధికార బీజేపీ అప్పగించిందన్నారు. 2015లో స్విస్ బ్యాంక్ లో రూ.8,392 కోట్లుగా ఉన్న నల్లధనం 2021 నాటికి రూ.30,500 కోట్లకు పెరిగిందన్నారు. రూ.37 వేల కోట్ల మేర బ్యాంకు లను ముంచిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు మోదీ హయాం లో విదేశాలకు పరారైనట్లు పేర్కొన్నారు. 

రైతు వ్యతిరేక విధానాలు..

నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసే బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో 700 మంది రైతుల బలయ్యారని కాంగ్రెస్ తెలిపింది. రైతు రుణమాఫీ చేయని మోదీ కార్పొరేట్లకు రూ.25 లక్షల రుణాలను మాఫీ చేశారని కాంగ్రెస్ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. పదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు మూడింతలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. 

ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ 

ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రూ.3.8 లక్షల కోట్లు భారీ స్కామ్ జరిగినట్లు తెలిపింది. బీజేపీకి చందాలు ఇచ్చిన ఫార్మా కంపనీలకు నకిలీ మందులు తయారు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ప్రైవేట్ కంపెనీల దగ్గర పార్టీ ఫండ్స్ తీసుకుని ప్రాజెక్టుల మంజూరు పేరుతో ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల నుంచి రక్షణ కల్పించిందని తెలిపింది. కులగణన నిర్వహణను మోదీ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించింది.

ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనం..

దేశం అప్పులు రూ.55 లక్షల కోట్ల నుంచి రూ.183.67 లక్షలకు పెరిగిందని, ప్రతి పౌరుడిపై రూ.1.51 లక్షల అప్పుల భారం పడిందని తెలిపింది. డాలర్‌తో రూపాయి విలువను రూ.40 తీసుకువస్తామని చెప్పి రూ.85కు మోదీ ప్రభుత్వం దిగజార్చిందని పేర్కొంది. మోడీ హయాంలో 2 వేల చదరపు కిలో మీటర్లకు పైగా భారత్ భూబాగాన్ని చైనా ఆక్రమించిందని ఆరోపించింది. మోదీ అసమర్థ విదేశాంగ విధానంతో మన పొరుగుదేశాలు చైనాకు దగ్గరవుతున్నాయని చెప్పింది.

బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు

l రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే పేదవర్గాలు రిజర్వేషన్లు మరిచిపోవాల్సిందేనని అన్నారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ విధానం అమలు చేసేందుకు ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. 2025 నాటికి రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోందని, ఆ దిశగా మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు తీసేయాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, అందుకే మోదీ పదే పదే 400 సీట్లు కావాలని అడుగుతున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో బీజేపీపై చార్జ్‌షీట్‌ను డిప్యూటీ సీఎం భట్టి, మం త్రులు కోమటిరెడ్డి, సురేఖ, పొన్నం, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం గా ప్రకటిం చారని, అందుకే దీనిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి గెలిచి రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఎత్తుగడలు వేస్తోందన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు దారి తీస్తుందని అన్నారు. 

నల్లధనం తీసుకురాలేదేం: భట్టి

మోదీ దేశ సంపదను ప్రజలకు దక్కకుండా దళారులకు కట్టబెడుతున్నాడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. మతం, కులం పేరుతో సమాజాన్ని విభజించి ఘర్షణలకు బీజేపీ ఆజ్యం పోస్తుందన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనం వెనక్కి రప్పించి పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల జమ చేస్తానని వాగ్దానం చేసి తుంగలో తొక్కారని విమర్శించారు. రాహుల్ తన బస్సు యాత్రలో రోజు ప్రజలతో మమేకమయ్యారని చెప్పారు.