18 April, 2026 | 11:04 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

నాలుగు వారాల్లో తేల్చండి

24-03-2025 11:55 PM

రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి 4 వారాల గడువు..

తదుపరి విచారణ ఏప్రిల్ 21కి వాయిదా..

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పౌరసత్వం గురించి ఏదో ఒకటి తేల్చాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ ఆంశంపై నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని సూచిస్తూ ఈ కేసును ఏప్రిల్ 21కు వాయిదా వేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో చాలా రోజుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బ్రిటన్ పౌరుడని ఆరోపిస్తూ.. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారించిన లక్నో బెంచ్ కేంద్రానికి 4 వారాల గడువునిస్తూ తీర్పు వెలువరించింది. బ్రిటన్‌లో ఉన్న ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్‌లో తాను బ్రిటీష్ పౌరుడినని రాహుల్ గాంధీ పేర్కొన్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపైనే కొద్ది రోజులుగా కేసు నడుస్తోంది.