24 March, 2026 | 10:38 PM

ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా స్పందించని అధికారులు…

24-03-2026 08:49 PM

ఎల్ఐజీ కాలనీలో నీటి సమస్య తీవ్రం

సనత్‌నగర్(విజయక్రాంతి): ఎల్ఐజీ (LIGH) కాలనీ వాసులు బి.కే.గూడా డివిజన్‌లో నెలకొన్న లో-ప్రెషర్ నీటి సరఫరా సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆకుల మహేష్, కుశల్, శౌ రెడ్డి, లక్ష్మీనారాయణ, మహేష్, పోతా రాజు, హరి ప్రసాద్, సత్యనారాయణ, జై నాథ్ రావు, అశోక్ తదితరులు సంబంధిత జీఎం, డీజీఎం, మేనేజర్‌లకు రెండోసారి వినతిపత్రం సమర్పించారు. అయితే, ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.