12 August, 2026 | 7:05 PM

రాక్ బాల్ క్రీడాకారుడు గోపాల్ యాదవ్ ను అభినందించిన కవిత

12-08-2026 04:57 PM

మేడ్చల్,(విజయక్రాంతి): దక్షిణాసియా రాక్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి విశేషంగా కృషి చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఇటబోయిన గోపాల్ యాదవ్‌ బుధవారం గురువారం తెలంగాణ రక్షణ సేన  అధినేత్రి కల్వకుంట్ల కవితను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవిత, గోపాల్ యాదవ్ కు శాలువా కప్పి  సన్మానించి అభినందనలు తెలిపారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయంలో భాగస్వామి కావడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ యువత క్రీడల్లో రాణిస్తూ దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. గోపాల్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన మహిళా అధ్యక్షురాలు వనజ, నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గండికోట కుమార్, గ్రామస్తులు శ్రీపాల్ యాదవ్, కిరణ్, సాయిబాబు, చిత్తారి తదితరులు పాల్గొన్నారు.