డిప్యూటీ మేయర్ సునీల్ రావు జన్మదిన వేడుకలు
28-09-2026 | 06:23pm
ముకరంపుర, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Sunil Rao) జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. యాదగిరి సునీల్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి జిలేబి పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో సునీల్ రావు అభిమానులు, ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పెద్దత్తున పాల్గొని సునీల్ రావు వర్ధిల్లాలి, లాంగ్ లీవ్ సునీల్ అన్న అంటూ నినాదాలతో అభిమానాన్ని చాటుకున్నారు.