ఆరు నెలల్లో దేవాదుల నీరు లక్నవరం చెరువులోకి..
మంత్రి సీతక్క హామీ
ములుగు, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఆరు నెలలలోగా భూసేకరణ పూర్తి చేసి దేవాదాలను నీరును లక్నవరం చెరువులోకి మళ్లించే ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి సీతక్క(Minister Seethakka) హామీ ఇచ్చినట్టు రైతు సంఘం నాయకులు తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు ఆయకట్టు రైతులు సోమవారం లక్నవరం చెరువుకు రామప్ప చెరువు నుండి గ్రావిటీ కాల్వను లక్నవరం రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది.
కాల్వ మొత్తము 6 కిలోమీటర్లు ఉంటుందని దీనికి 35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా డిఈపి రవీందర్ రెడ్డి రైతులకు వివరించారు. గతంలో 120 ఎకరాల దాకా భూసేకరణ అవసరం ఉండేదని కానీ దానిని 80 ఎకరాల వరకే తగ్గించి ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు. అనంతరం కమిటీ ములుగు జిల్లా కేంద్రంలో మంత్రిని కమిటీ కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో లక్నవరం చెరువులోకి నీరు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. రెండు నెలలలో భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు తుమ్మల వెంకటరెడ్డి మాచినేని సాంబశివరావు మాట్లాడుతూ లక్నవరం చెరువులోకి దేవాదూల నీరు వచ్చేదాకా మా కమిటీ పోరాటం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తీగల ఆదిరెడ్డి, భూక్య దేవ, గుండు రామస్వామి, గొల్యాల నర్సిరెడ్డి, గూడూరు శ్రీనివాసరావు, నిమ్మగడ్డ సతీష్, బండమీది అశోక్, పైడాకుల జగదీష్, బూరెడ్డి మధుసూదన్ రెడ్డి, చింతల లింగారెడ్డి, మేడ సైదిరెడ్డి, మట్టా వెంకట పాపిరెడ్డి శివారెడ్డి, చలం, జంగిల్ అశోక్, నరాల సమ్మిరెడ్డి, కనిగంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.