మొయినాబాద్‌లో ముమ్మరంగా అభివృద్ధి పనులు
16వ వార్డులో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం
మొయినాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి):మొయినాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలకవర్గం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం 16వ వార్డులో రూ. 10 లక్షల నిధులతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ సోనియా దర్శన్ ఘనంగా ప్రారంభించారు. 16వ వార్డు కౌన్సిలర్ గీత వనజాక్షితో కలిసి చైర్పర్సన్ భూమి పూజ చేసి పనులను మొదలుపెట్టారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత అని చైర్పర్సన్ పేర్కొన్నారు.
అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసి, మొయినాబాద్ను రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నిలుపుతానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ‘ప్రజల సౌకర్యార్థం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, నిరంతరం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తాం అని ఛైర్పర్సన్ సోనియా దర్శన్ పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్ మమత మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




