లేబర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా
శంషాబాద్ డివిజన్ లేబర్ డిపార్ట్మెంట్ ఏఎల్వే బి. వాల్యానాయక్
మొయినాబాద్ ఏప్రిల్ 8(విజయ క్రాంతి): ప్రభుత్వ పరంగా కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని శంషాబాద్ డివిజన్ లేబర్ డిపార్ట్మెంట్ ఏఎల్వో బి.వాల్యానాయక్ పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి తోల్కట్ట శివశంకర్ గౌడ్, జిల్లా లెబర్ సెల్ గౌరవ అధ్యక్షురాలు జ్యోతి భీంభరత్ కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా లేబర్లకు ఉన్న సమస్యలను శివశంకర్ గౌడ్ తెలియజేశారు. కార్మికులకు కార్డులు అందజేయాలని వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ద్వారా కృషి చేయాలన్నారు. భవనం, నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు సంక్షేమానికై 1996లో చట్టం చేయబడిందన్నారు. ఈ చట్ట పరిధిలో లబ్ధిదారులుగా నమోదు కాబటిన ప్రతి ఒక్కరికి సంక్షేమ మండలి ద్వారా లబ్ధి పొందేలా చూడాలని కోరారు.
ప్రమాదవశాత్తు పూర్తి శాశ్వత అంగవైఖల్యం కలిగిన వారికి 5 లక్షల ఆర్థిక సహాయం, పార్శిక అంగవైఖల్యం కలిగిన వారికి నాలుగు లక్షలు అందేలా చూడాలన్నారు. ఎంప్లాయిమెంట్ కంపెనేషన్ యాక్టు ప్రకారం అంగవైఖల్య శాతాన్ని బట్టి ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఇలా లబ్ధిదారులకు ఉన్న సమస్యలు అందజేసేందుకు ప్రభుత్వం ద్వారా తమవంతు కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఏఎల్వో బి. వాల్యానాయక్ మాట్లాడుతూ లేబర్ కార్మికుల పట్ల తనవంతు సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఆయనను కలిసిన వారిలో షాబాద్ లెబర్ సెల్ అధ్యక్షులు ముక్కు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.




