30 June, 2026 | 11:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

09-04-2025 01:43 AM

పెద్దపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కార్పోరేషన్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతి పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. 

వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా చీకటి ప్రదేశం ఉండకుండా చర్యలు తీసుకొని ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని, రోడ్లపై ఎక్కడ చెత్తాచెదారం ప్లాస్టిక్ ఉండకుండా రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు.

ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ కింద 25 శాతం ఫీజు రాయితీ గడువు ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని, దీనిని సంబంధిత ప్రజలు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని, ఎల్.ఆర్.ఎస్ క్రింద ఆమోదం పొందిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ ఏప్రిల్ 30 లోపు రుసుము చెల్లించి 25 శాతం రాతి పొందేలా చూడాలని అన్నారు. ఈ  సమావేశంలో  ఈఈ మున్సిపల్ కార్పొరేషన్ రామన్,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.