30 June, 2026 | 9:41 PM

Breaking News

ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •  

డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక

30-06-2026 09:10 PM

పాపన్నపేట: తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన బసవలింగప్ప ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదులో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే యూసఫ్ పేటకు చెందిన రమేష్ శర్మ ముఖ్య సలహాదారుగా ఎన్నికవడం విశేషం. తమపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు ఇరువురు రాష్ట్ర అధ్యక్షులు వాసుధేవ్ శర్మ, జిల్లా అధ్యక్షులు రాజేశ్వర శర్మ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.