24 March, 2026 | 8:44 AM

దేవకీనందన వాసుదేవ మాస్ యాక్షన్

27-10-2024 12:00 AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’లో మాస్, యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది. 

ఇప్పటికే విడుదలైన మొదటి రెండు పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను శంకర్ పిక్చర్స్ దక్కించుకుంది. ‘హను ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ కథ అందించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు మాటలు: సాయి మాధవ్ బుర్రా; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్; ఎడిటర్: తమ్మిరాజు.