విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
14-08-2026 09:56 PM
సర్పంచ్ కృష్ణనాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని సూర్యానాయక్ తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తన ధర్మపత్ని సైదమ్మతో కలిసి ప్రభుత్వం అందజేసిన స్పోర్ట్స్ మెటీరియల్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మీ బాలాజీ నాయక్, సుజాత సంజీవ నాయక్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, పాఠశాల హెచ్ఎం రమేష్ సహోపాధ్యాయుడు లింగయ్య, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ ఆంగోతు నర్సింహా, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






