14 August, 2026 | 10:24 PM

పశువుల దొంగలు అరెస్టు

14-08-2026 09:48 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల చోరీకి యత్నించిన ఆరుగురు నిందితులను పోలీసులు  అరెస్టు చేశారు. తాండూర్ ఎస్ఐ ప్రసాద రావు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలరావుపేట గ్రామానికి చెందిన తుపాకుల తిరుపతికి చెందిన నాలుగు పశువులను గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తీసుకు వెళ్లారు. తిరుపతి  స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు  రంగంలోకి దిగి దొంగతనానికి యత్నించిన వారిపై నిఘా పెట్టి విచారించారు.

ఈ కేసులో  బుర్సా భీమేశ్ (గోపాల్ రావు పేట), ఆత్రం శ్రీకాంత్ (పుల్కకుంట),టేకం పోశం (పులి కుంట), గోగర్ల తిరుపతి (పులి కుంట), కమ్మరి కిష్టయ్య (పులికుంట) ,సుంకే అంజన్న (పులి కుంట) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఆరుగురు నిందితులను పట్టుకొని పూర్తిస్థాయి పోలీసులు విచారించగా నాలుగు పశువులను తామే చోరీకి ప్రయత్నించడం జరిగిందని ఒప్పుకోన్నారు. ఈమేరకు  ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన ఎస్సై ప్రసాదరావు వెల్లడించారు.