calender_icon.png 13 November, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి గిరిప్రదక్షణ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

11-08-2024 10:26:02 AM

యాదాద్రిభువనగిరి (విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన కొండ చుట్టూ గిరిప్రదక్షిణలో ఆదివారం స్వాతి తిరు నక్షత్రం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలలతో పాటు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ముందుగా పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, జై భోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ,భజనలు చేస్తూ,యధా ఋషి వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ పాల్గొన్నారు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వాతి నక్షత్రం సందర్భంగా కుటుంబ సమేతంగా సామూహిక గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.