ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం
విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
పిల్లల ఆరోగ్యం మనందరి కర్తవ్యం
సర్పంచ్ పెద్దిగారి యాదనమ్మ శ్రీనివాస్
ముస్తాబాద్,జూలై 13(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేశారు.గ్రామీణ పిల్లల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి. విద్యార్థులకు ఆల్బెండజోల్ (డీవార్మింగ్) మాత్రలను డాక్టర్ హఫీజ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూలిపురుగుల నివారణ మాత్రలను విద్యార్థులకు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన బాల్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.1 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరికీ ఈ మాత్రలు ఎంతో అవసరమని,వీటి ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గి,శారీరక,మానసిక ఎదుగుదల మెరుగ్గా పనిచేస్తుందని,మనమంతా ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యతగా మంచి అలవాట్లను అలవర్చాలని సూచించారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోస్టర్ల ద్వారా విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా నూలిపురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అంగన్‌వాడీ,ఆశా కార్యకర్తలు,వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని,వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ పాలక వర్గానికి,వైద్య సిబ్బందికి గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.






