రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రచ్చపల్లిలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ
మంథని, జూలై 13(విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంథని మండలంలోని రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచితంగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రచ్చపల్లి గ్రామ సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్ పాల్గొని పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి చిన్నారికి అల్బెండజోల్ మాత్రలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, సరిత, ఆశా వర్కర్ సునీత, అంగన్వాడీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నులిపురుగుల నివారణ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.






