17 April, 2026 | 6:29 PM

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా

15-04-2026 01:53 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దురదపాడులో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పేకాట స్టావరం పై దాడి చేసి నలుగురిని అరెస్టు చేసే క్రమంలో ఎస్ ఐ కొట్టారని వారి కుటుంబ సభ్యులు సుమారు 100 మంది పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు బాటిళ్లతో ఎస్ ఐ ను సస్పెండ్ చేయాలని ధర్నా నిర్వహించారు. పేకాట ఆడుతున్నవారినే కాకుండా రోడ్డుపై వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తున్న తమను అన్యాయంగా కొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారని, తనకు ఈ మధ్యే హెర్నియా ఆపరేషన్ జరిగిందని, కొట్టవద్దని కాళ్లపై పడి బ్రతిమిలాడినా కూడా కనికరించ లేదనీ బాధితుల్లో ఒకరు తెలిపారు.

దీంతో బుధవారం కుటుంబ సభ్యులు ఎస్ ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలని పెట్రోలు బాటిళ్లు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పాల్వంచ డీఎస్పీ సతీష్, అశ్వారావుపేట సి ఐ నాగరాజు ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి వ్రాతపూర్వకంగా సి ఐ కు ఫిర్యాదు చేయాలని, అక్కడ కూడా మీకు న్యాయం జరుగలేదని భావిస్తే స్వయంగా నేనే దర్యాప్తు చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.