20 August, 2026 | 2:38 PM

తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని ధర్నా

20-08-2026 02:06 PM

గంభీరావుపేట,ఆగస్టు20(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల(Gambhiraopet Mandal) కేంద్రంలోని కేజీ టు పీజీ ప్రాంగణం ముందు బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, డిగ్రీ విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ను వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.కోడె రమేష్ మాట్లాడుతూ, గంభీరావుపేట – లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని కోరారు. రవాణా సౌకర్యం కల్పించేందుకు తాత్కాలికంగా మట్టి రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.మండల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు బస్సుల ద్వారా రావాల్సి ఉంటుందని, ప్రస్తుతం మట్టి రోడ్డును తొలగించడంతో బస్సులు సమయానికి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మట్టి రోడ్డు ఏర్పాటు చేసి, విద్యార్థులకు తక్షణ న్యాయం చేయాలని వారు కోరారు. ధర్నా వద్దకు తాహసిల్దార్ మారుతి రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ చేరుకుని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి వారం రోజుల్లో తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ,జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి తొట్ల మల్లేష్ యాదవ్,నాయకులు దేవేందర్ యాదవ్ రాజేష్ చారి డిగ్రీ విద్యార్థులు తదితరులు ఉన్నారు.