20 August, 2026 | 2:16 PM

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

20-08-2026 01:39 PM

గంభీరావుపేట ఆగస్టు 20 (విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ నిమ్మల తిరుపతి గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న సాంకేతికతకు రాజీవ్ గాంధీ ఆధ్యుడని, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజ్వీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్,వార్డ్ సభ్యురాలు అక్కపల్లి లత నాయకులు రాజుగౌడ్, రాజశేఖర్ నరేష్ వర్మ తదితరులు ఉన్నారు.