27 June, 2026 | 1:13 AM

ధృవ్ జురెల్ సెంచరీ

27-06-2026 12:14 AM

శ్రీలంక ఏతో అనధికార టెస్ట్

గాలే, జూన్ 26 : శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భా రత్ ఏ భారీస్కోరు సాధించింది. కెప్టెన్ ధృవ్ జురెల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలిరోజే సాయి సుదర్శన్ (132) శతకం చేయ గా, రెండో రోజు జురెల్ (141 నాటౌట్) అదరగొట్టాడు.

ఓవర్ నైట్ 333/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కాసేపటికే షేక్ రషీద్ (63) రూపంలో వికెట్ కోల్పోయింది. అయితే, కెప్టెన్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో జట్టు స్కోరుబోర్డును ప రుగులు పెట్టించాడు. అతడికి హర్ష్ దూబే (30) సహకారం అందించాడు. చివరి భార త్ స్కోరు 450+ దాటగానే ఇన్నింగ్స్ జురెల్ డిక్లేర్ చేశాడు.

శ్రీలంక బౌలర్లలో చమిక గు ణశేఖర 3, దిలుమ్ సుదీరా 2, రవిందు ఫె ర్నాండో ఒక వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఏ రెండో రోజు ఆట ముగిసేసమయానికి 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో నువానిదు ఫె ర్నాండో (65 నాటౌట్), ఆష్హేన్ బండారా (18 నాటౌట్) ఉన్నారు. ఓపెనర్లు పవాంత వీరసింగే (11), నిరోషన్ డిక్వెల్లా (10) విఫలమయ్యారు. భారత్- ఏ బౌలర్లు అన్షుల్ కాం బోజ్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.