27 June, 2026 | 2:14 AM

ఫోక్స్‌వ్యాగన్‌లో లక్ష మంది తొలగింపు?

27-06-2026 01:02 AM
  1. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో సంస్థ
  2. వ్యయ నియంత్రణకు కఠిన నిర్ణయాలు

బెర్లిన్, జూన్ 26: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీని గట్టెక్కించేందుకు యాజమాన్యం కఠిన నిర్ణ యాలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా  లక్ష ఉద్యోగులను తొలగించాలని చూస్తోంది.  ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒక్క జర్మనీలోనే 43 శాతం మంది పనిచేస్తున్నారు.  

15 శాతానికి కుదింపు

భారీగా ఉద్యోగ కోతలతో పాటు వ్యయ నియంత్రణలో భాగంగా జర్మనీలోని హానో వర్, జ్విక్కావ్, ఎమ్డెన్, ఆడికి చెందిన నెక్సా ర్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడుల ప్రణాళికలను సైతం 15 శాతం కుదించాలన్నది సీఈవో ప్రణాళిక. దశాబ్దం చివరి నాటికి జనరల్ ఓవర్‌హెడ్ ఖర్చులను 12.5 బిలియన్ డాలర్ల మేర తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎందుకీ బ్లడ్‌బాత్?

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే భారీ ఖర్చులు, చైనా నుంచి ఎదురవుతున్న తీవ్ర మైన పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుం టున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాద నలపై స్పందించిన ఫోక్స్‌వ్యాగన్ వర్క్స్ కౌన్సిల్, జర్మనీకి చెందిన ఐజీ మెటల్ నియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

యాజ మాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడితే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించాయి. కాగా, ఫోక్స్‌వ్యాగన్ 50 వేల మందిని తొల గించాలని ప్రస్తుతం ప్రణాళికగా పెట్టుకుంది. దశాబ్దం పాటు ఏ ఒక్క ప్లాంటూ వసివేయ బోమంటూ 2024 కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుంది. అందుకు పూర్తి వి రుద్ధంగా ఉండడంతో కార్మిక సంఘాల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది.