పీఏసీఎస్ ఆమ్దాపూర్‌లో డిజిటల్ ఆరోగ్య సేవలు

23-09-2026 | 02:10pm

బోధన్ .సెప్టెంబర్ 23(విజయ క్రాంతి): భారత్‌స్వాస్థ్య (Bharatsvasthya) భాగస్వామ్యంతో పీఏసీఎస్ ఆమ్దాపూర్‌లో ప్రాథమిక డిజిటల్ ఆరోగ్య సేవలను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవల ద్వారా స్థానిక భాషలో 24 గంటలు, 365 రోజుల పాటు ఆడియో, వీడియో కాల్స్ ద్వారా నిపుణులైన వైద్యుల సలహాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్ ఆమ్దాపూర్ ప్రాంగణంలో స్మార్ట్ క్లినిక్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ సేవలో భాగంగా ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు 24×7 అపరిమిత ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం కల్పిస్తారు. అలాగే స్మార్ట్ క్లినిక్, మందులకు అపరిమిత ప్రాప్యత ఉంటుంది.కుటుంబంలోని ప్రధాన సభ్యుడికి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1 లక్ష, శాశ్వత వైకల్యానికి రూ.1 లక్ష, పాక్షిక వైకల్యానికి రూ.50 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే పిల్లల చదువుకు రూ.50 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.5 వేలు వరకు భీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

అదేవిధంగా ఆసుపత్రిలో చేరిన సమయంలో రోజువారీ నగదు ప్రయోజనం కింద సాధారణ అడ్మిషన్‌కు రోజుకు రూ.1,000, ఐసీయూ అడ్మిషన్‌కు రోజుకు రూ.2,000 చొప్పున, సంవత్సరానికి గరిష్టంగా 30 రోజుల వరకు సదుపాయం కల్పిస్తారు. ఈ ఆరోగ్య సేవలు, భీమా ప్రయోజనాలను పొందేందుకు సంవత్సరానికి రూ.1,200 రుసుము చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


మరిన్ని వార్తలు