18 April, 2026 | 11:39 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఆస్ట్రేలియా బృందంతో దిల్ రాజు భేటీ

12-04-2025 12:00 AM

ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత హర్షిత్‌రెడ్డి ఆస్ట్రేలియన్ కా న్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు విచ్చేసిన ఈ బృం దంలో డిప్యూటీ కాన్సు ల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్ మధ్య, ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే విషయమై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఇరు దేశాల మధ్య సినిమా సహ నిర్మాణాలు (కో సాంస్కతిక కార్యక్రమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల మారకం (టాలెంట్ ఎక్సేంజ్) వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై, తెలుగు సినిమాపై ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.