మట్టి గణపతుల పంపిణి అభినందనీయం

12-09-2026 | 11:38pm

-మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్

మెట్ పల్లి,(విజాయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా మట్టి గణపతులు పంపిణి చేయడం అభినందనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్(Met Pally Senior Civil Judge R.Ajay Kumar) అన్నారు. తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ (Tula Gangavva Memorial Trust)ఆధ్వర్యంలో శనివారం మెట్ పల్లి కోర్టులో న్యాయ వాదులకు ఉచిత మట్టి గణపతుల పంపిణి(Distribution of clay ganpati idols) చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మట్టి గణపతుల్ని పంపిణి చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... సామాజిక సేవలో భాగంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డా. తుల రాజేందర్ మట్టి గణపతుల్ని పంపిణి చేయడం అభినందనీయం అన్నారు.

న్యాయవాదులు కూడా మట్టి గణపతులు పూజించి, ప్రజలకు ఆదర్శంగా ఉండటం శుభ పరిణామం అన్నారు. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం టీ తాగడానికి నూటయాభై స్టీల్ గ్లాసుల్ని బార్ అసోసియేషన్ కి రాజేందర్ వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, న్యాయవాదులు మగ్గిడి వెంకట నర్సయ్య, వడ్డేపల్లి శ్రీనివాసన్, యండి వల్లియొద్దీన్, గండ్ర ప్రవీణ్ రావు, బర్ల లక్ష్మణ్, దండబోయిన యాదగిరి, ఒజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు