పెద్దమల్లారెడ్డిలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ
13-09-2026 | 02:42pm
భిక్కనూర్, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి(Peddamalla Reddy)గ్రామంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెరుమాళ్లు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి సాయాగౌడ్, ఉపసర్పంచ్ చైతన్య కొండల్‌రెడ్డి, ఛత్రపతి ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.