5 March, 2026 | 2:02 PM

కాసీంబౌలిలో చెత్త డబ్బాల పంపిణీ

05-03-2026 12:00 AM

స్వచ్ఛ గ్రామమే లక్ష్యంగా సర్పంచ్ రాజేందర్ రెడ్డి పిలుపు

మొయినాబాద్, మార్చి 4 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని కాసీంబౌలి గ్రామాన్ని ఆదర్శవంతమైన స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గ్రామ సర్పంచ్ మడి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని పాఠశాలలో అంగన్వాడి కేంద్రాలలో  చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రాధాన్యతగా, విద్యా సంస్థల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.

గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడాలంటే ప్రజలందరూ భాగస్వాములు కావాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా డబ్బాల్లోనే వేయాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన కాసీంబౌలి గ్రామంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులతో గ్రామాన్ని ముందంజలో ఉంచుతాం అని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో  పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.