5 March, 2026 | 3:42 PM

కాంగ్రెస్‌లో చేరిన మత్స్య సహకార సంఘం చైర్మన్

05-03-2026 12:00 AM

మేడ్చల్, మార్చి 4 (విజయ క్రాంతి): జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ మన్నె రాజు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి నియోజకవర్గ ఇన్చార్జి కొలను హనుమంత రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. మన్నె రాజుకు డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వన్నె రాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, కె.యం. గౌరీష్, లక్ష్మారెడ్డి, రషీద్, బట్ట పాల కృష్ణ, సిద్ధనాల సంజీవరెడ్డి, మైసి గారి శ్రీనివాస్, బైరి ప్రశాంత్ గౌడ్, ఆలేటి శ్రీనివాసరావు, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.