13 July, 2026 | 3:00 PM

జిల్లెలలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ.. లబ్ధిదారుల్లో ఆనందం

13-07-2026 02:15 PM

తంగళ్ళపల్లి,జులై 13(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం త్వరగా ప్రారంభించాలని సూచించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.