13 July, 2026 | 3:02 PM

డంపింగ్ యార్డును పచ్చని పొలాల్లోకి తరలించొద్దు.. సిద్దాపూర్ గ్రామస్తులు ఆవేదన

13-07-2026 02:07 PM

కాలుష్య కారక డంపింగ్ యార్డు

పచ్చని పొలాల్లోకి తరలించొద్దని సిద్దాపూర్ గ్రామస్తులు ఆవేదన

జీవో 641 ను రద్దు చేయాలంటూ డిమాండ్.

జాతీయ రహదారిపై ధర్నా.

రంగారెడ్డి: జీవో నంబర్ 641 ను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) కొత్తూరు మండలం పరిధిలోని సిద్దాపూర్, కొడిచర్ల, పలు తాండలా గ్రామస్తులు వందలాదిగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిద్దపూర్ గ్రామ(Siddhapur villagers) పరిధిలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన డంపు యార్డు వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమై అక్కడినుండి నేరుగా జాతీయ రహదారిపైకి వందలాది మంది చేరుకొని రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

కాలుష్య కారకమైన చెత్త డంపింగ్ యార్డ్ సిద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 641 రద్దు చేసే వరకు ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలిపారు. డంపు యార్డు వల్ల పచ్చని పంట పొలాలు, నీళ్లు కాలుష్యం అవుతాయని, పంటలే జీవనదారంగా బ్రతికే తమకు బ్రతుకు భారం అవుతుందని రైతులు అన్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను, రైతులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.