ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
31-08-2026 05:28 PM
గణపురం,(విజయక్రాంతి): మండలంలోని బుద్ధారం గ్రామంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులు అందుతున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న రేషన్, ఇతర సంక్షేమ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ పొందేందుకే కాకుండా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అవసరమైన సమయంలో అక్కడి నుంచే రేషన్ పొందే వెసులుబాటు కల్పించామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు.






