24 July, 2026 | 10:17 AM

యువత మీద కేసులు పెట్టొద్దు

24-07-2026 09:32 AM

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి

కొత్తగూడెం , (విజయక్రాంతి): నీట్  పరీక్ష పత్రం లీకేజీ ఘటనకు పూర్తి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడిపెల్లి మహేశ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్ విద్యార్థుల పై పోలీస్ చర్యను ఖండిస్తూ న్యాయవాదులు గురువారం సంఘ కార్యాలయంలో సంఘం అద్యక్షుడు కిరణ్ కుమార్ అద్యక్షతన సర్వసభ్యసమావేశం నిర్వహించారు... ఈ సమవేశంలో సభ్యులు ముక్తకంఠంతో ఢిల్లీ పోలీసుల చర్యను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో  పోస్టాఫీసు  అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపాలని సమావేశంలో తీర్మానించారు.

అనంతరం ర్యాలీగా పోస్టాఫీసు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేష్ గడి పెల్లి... మాట్లాడుతు ఢిల్లీలో నీట్ విద్యార్థుల పై పోలీస్ చర్యను  ఖండిచారు.నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ దారుణమన్నారు. ప్రభుత్వం బాధ్యతను విస్మరించినప్పుడు ఇలాంటి ఉద్యమాలే జరుగుతాయని, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు దేశ నలుమూలల నుంచి ఆహార పదార్థాలను పంపి దేశ ప్రజలు వారి నిరసనకు మద్దతు తెలియజేశారని ప్రభుత్వం గమనించి వారి డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయదాదులు శివరామ్ ప్రసాద్,రమేష్ కుమార్ మక్కడ్,కె.పుల్లయ్య,కోటం రాజు,ఉపేందర్,జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ తదితరులు పాల్గొన్నారు.