24 July, 2026 | 11:06 AM

రాహుల్ గాంధీ అరెస్టు పై ఖానాపూర్ కాంగ్రెస్ నిరసన

24-07-2026 10:00 AM

ఖానాపూర్( విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు జంగిలి శంకర్, గొర్రె గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఎన్నోసార్లు పేపర్ల లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుందని దీనికి నిరసన చేబడితే రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. దేశంలోని యువత అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం విలువ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల, గ్రామాల నాయకులు పలువురు పాల్గొన్నారు.