కుక్కకాటు.. ఆందోళనే చేటు!
- గ్రామాల్లో పెరుగుతున్న వీధికుక్కల బెడద
- నేరేడుచర్ల మండలంలో 9 నెలల్లో 1250 పైగా బాధితులు
- ప్రతి నెలా 1,20,130 బాధితులకు వ్యాక్సినేషన్
- పీహెచ్సీల్లో సరిపడా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
నేరేడుచర్ల, సెప్టెంబర్ 27 : గ్రామీణ ప్రాంతాల్లో( rural areas) వీధికుక్కల (Stray dogs)బెడద ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లోని ప్రధాన రహదారులు, కాలనీలు, పాఠశాలల పరిసరాలు, చెత్తకుప్పల వద్ద కుక్కల గుంపులు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ముఖ్యంగా చిన్నారు లు, వృద్ధులు,ఉదయం-సాయంత్రం బయట కు వెళ్లే ప్రజలు కుక్కల దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కు క్కకాటు ఘటన జరిగినప్పుడు కొందరు ఆందోళనకు గురవుతుండగా, మరికొందరు చి న్న గాయమేనని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయి తే కుక్కకాటును ఏమాత్రం నిర్ల క్ష్యం చేయకుండా వెంటనే వై ద్యులను సంప్రదించడం అ త్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్క నేరేడుచర్ల మండలంలోనే నెలకు 130 పైగా
పీహెచ్సీకి వస్తున్న కుక్కకాటు బాధితుల సంఖ్యను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం బాధితులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.
తొమ్మిది నెలల్లో 1250 కి పైగా కుక్కకాటు కేసులు :
మండలoలో ఉన్న నేరేడుచర్ల, పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో, తొమ్మిది నెలల్లో సుమారు 1250 మందికి పైగా యాంటీ రేబిస్ టీకాలు వేసుకోవడం సమస్యకు తీవ్రతకు అద్దo పడుతుంది. అధికారికంగా నమోదైన కేసులే ఇలా ఉంటే, అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రులలో కు క్కకాటుకు వాక్సిన్ తీసుకునే వారు ఎంతో కొంత మంది వుండే అవకాశం లేకపోలేదు.
జనవరి 2026 నుండి సెప్టెంబర్ నెల చివరి వరకు తొమ్మిది నెలల కాలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వెయ్యి కి పైగా కుక్క కాటు కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం.ప్రతి నెలా సగటున 120130 మంది కుక్క కాటు బాధితులు పీహెచ్సీని ఆశ్రయిస్తున్నారంటే, కుక్కకాటు సమ స్యను కేవలం అప్పుడప్పుడు జరిగే ఘటనగా చూడలేమని స్పష్టమవుతోంది. అయితే బాధితులకు చికిత్స అందించడం ఎంత ముఖ్యమో, కుక్కకాటు ఘటనలు తగ్గేలా ముందస్తు చర్యలు చేపట్టడం కూడా అంతే అవసరం.
చెత్తకుప్పలే కుక్కలకు ఆవాసాలా?
గ్రామాల్లో బహిరంగంగా పడేస్తున్న ఆహార వ్యర్థాలు, మాంస వ్యర్థాలు, ఇతర చెత్త కారణంగా కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి. జనావాసాల మధ్యే కుక్కల సంచారం పెరగడానికి పారిశుధ్య నిర్వహణ లోపాలు కూడా ఒక కారణంగా మారుతున్నాయి. కుక్కకాటు బాధితులకు వ్యాక్సిన్ వేయడం ఒకవైపు...కుక్కలు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవడం మరోవైపు.ఈ రెండు అంశాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కుక్కకాటు జరిగితే ఏం చేయాలి?
కుక్కల గుంపులు కనిపించే ప్రాంతాల్లో చిన్నారులు ఒంటరిగా తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలను రెచ్చగొట్టడం, వాటి దగ్గరకు వెళ్లడం వంటి చర్యలకు పిల్లలను దూరంగా ఉంచాలి.కుక్కకాటు లేదా గోకడం జరిగినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కుక్కకాటు జరిగిన వెంటనే గాయాన్ని సబ్బు, ప్రవహించే నీటితో బాగా కడిగి, వీలైనంత త్వరగా వైద్య కేంద్రాన్ని సంప్రదించాలి. టీకాలు లేదా ఇతర చికిత్స అవసరమా, ఎన్ని డోసులు అవసరమన్నది వైద్యులు నిర్ణయిస్తారు.ఇంటి చిట్కాలతో కాలయాపన చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.
అవగాహనే కాదు.. పరిష్కారమూ కావాలి
ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా కుక్క కాటు వల్ల భయపడాల్సిన అవసరం లేదు, నిర్లక్ష్యం మాత్రం వద్దు, అప్రమత్త అవసరం లాంటి అవగాహనతో పాటు నివారణ చర్యలు అవసరం.కుక్క కాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు రేబిస్పు అవగాహన కల్పించవచ్చు. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గ్రామస్థాయిలో కూడా నిరంతర చర్యలు అవసరం.
వీధికుక్కలకు వ్యాక్సినేషన్, వాటి సంఖ్యను శాస్త్రీయంగా నియంత్రించే చర్యలు, చెత్త నిర్వహణ, ప్రజలకు అవగాహన, కుక్కకాటు బాధితులకు సకాలంలో వైద్యంఇవన్నీ సమాంతరంగా కొనసాగాలి.గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ల్లో కూడా తీవ్రంగా ఉన్న కుక్కకాటు సమస్యపై అప్రమత్తత అవసరాన్ని తెలియజేస్తోంది.కుక్కకాటు జరిగితే భయపడొద్దు. వైద్యాన్ని మాత్రం ఆలస్యం చేయొద్దు!బాధితులకు సకాలంలో వ్యాక్సిన్ అందించడం అవసరం.అదే సమయంలో కుక్కకాటు ఘటనలు తగ్గేలా మూల కారణాలపై చర్యలు తీసుకోవడం మరింత అవసరం.
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి..
కుక్కకాటు బాధితులు ఎటువంటి ఆందోళన, అధైర్య పడాల్సిన పనిలేదు. కుక్కకాటుపట్ల అప్రమత్తత అవసరం. బాధితులకు సరిపోయేన్ని యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కుక్క కాటుకు గురైనటువంటి వ్యక్తులు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స తీసుకోవడం వల్ల రేబిస్ వ్యాధి ప్రమాదబారిన పడకుండా చూసుకోవచ్చు.
పి.నాగిని, పీహెచ్‌సీ వైద్యాధికారి, నేరేడుచర్ల