రాజన్న ఆలయాభివృద్ధికి అమెరికా ప్రవాస కుటుంబం చేయూత
13-07-2026 07:48 PM
- రూ.54 వేల విరాళం
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం అమెరికాలో నివసిస్తున్న హనుమకొండకు చెందిన చామల చందన–వివేకానంద్ కుటుంబ సభ్యులు రూ.54 వేల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థానం పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించి, దేవస్థానం తరఫున దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం, తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.






