13 July, 2026 | 8:49 PM

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

13-07-2026 08:06 PM

జిల్లా కలెక్టరేట్ ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ధర్నా.. కలెక్టర్‌కు వినతి

ముకరంపుర,(విజయక్రాంతి) జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మెర తిరుపతి రెడ్డి, జిల్లా నాయకుడు బండోజు శ్రీకాంత్ మాట్లాడుతూ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అర్హులైన పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు.కరీంనగర్ జిల్లాలో వివిధ పత్రికల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్క్రిడిడేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. త్వరలో కమిటీ ఆధ్వర్యంలో మిగతా జర్నలిస్టులకు తక్షణమే అక్క్రిడిటేషన్ కార్డులు అందజేయాలనీ కలెక్టర్ ను కోరారు అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు .