13 July, 2026 | 8:55 PM

జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా కోదాడ వాసి సాయిశర్మ

13-07-2026 08:12 PM

కోదాడ,(విజయక్రాంతి): జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా కోదాడ పట్టణానికి చెందిన సాయిశర్మ నియమితులయ్యారు. సోమవారం కోదాడలో సాయిశర్మ మాట్లాడుతూ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్ చేతుల మీదుగా తాను జిల్లా కన్వీనర్‌గా నియామక పత్రం అందుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణకు ఎండోమెంట్ సెల్ ద్వారా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వనం సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, వంగవేటి శ్రీనివాసరావు, గోదేశి.లక్ష్మణ్ తదితరులు జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా నియమితులైన సాయిశర్మకు అభినందనలు తెలిపారు.