15-02-2026 12:00:00 AM
మేడిపల్లి,ఫిబ్రవరి 14,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ద్వారకా నగర్ ఫేస్ 2 శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయ ర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ రూ. 50,000 విరాళం అందజేయడం జరిగింది. శనివారం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం ఆల య కమిటీ సభ్యులకు యాభై వేల రూపాయలు విరా ళం అందజేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం, భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆ హనుమంతుని ఆశీస్సులు ప్రజ లందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విరాళంఅందజేసినందుకు ఆలయ కమిటీ సభ్యు లు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, మూడో డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కాలనీ ప్రెసిడెంట్ రాజు, ప్రవీణ్, స్థానిక నాయకులు భక్తులు పాల్గొన్నారు.