calender_icon.png 5 December, 2024 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

07-11-2024 12:29:19 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, నవంబరు 6 (విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం తిమ్మాపూర్ మండ లంలోని రేణికుంట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి మంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు వస్తే రైతులు అధికారుల దృష్టికి, పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్వాహకులు ఎలాంటి జాప్యం చేయవద్దని, ఆన్‌లైన్ సిస్టమ్, పేమెంట్, తదితర ఎక్కడ ఆలస్యం చేయకూడదన్నారు. 

వాహనంలో క్షతగాత్రుల తరలింపు

తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై ఆటోను వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న మహిళలతోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదాన్ని గ్రహించి కాన్వాయ్ ఆపి క్షతగాత్రులను కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్నారు.