calender_icon.png 16 February, 2026 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

16-02-2026 03:50:05 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనీ తానేదారిపల్లిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం  భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... మహిళా సంఘాల బలోపేతానికి వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొగాకు పెద్ద సైదులు  వెంకటేశం పంచాయతీ కార్యదర్శి నజీరా ఫీల్డ్ అసిస్టెంట్ సల్వోజ్ యాదయ్య వార్డు మెంబర్లు లపంగి మహేందర్ డబ్బు యాదయ్య నాగిళ్ల అంజమ్మ వల్లపు హైమా భాస్కర్ పగిళ్ల యాదమ్మ శంకర్ భీమనగోని మల్లన్న యాదయ్య మహిళ సంఘం కార్యదర్శి కోశాధికారి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.