7 September, 2026 | 5:15 AM

గోదావరి పుష్కరాల కోసం డార్మెటరీ నిర్మాణం

07-09-2026 | 03:35am
  1. భద్రాచలంలో రూ.1.50 కోట్లతో నిర్మాణాలకు భూమిపూజ 
  2. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, సెప్టెంబర్ 6, (విజయక్రాంతి): వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం డార్మెంటరీ హాల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తు న్నామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు (Bhadrachalam MLA Dr. Tellam Venkat Rao) తెలిపారు.

గోదావరి పుష్కరాల కోసం భద్రాద్రి జిల్లాలోని దక్షిణ అయోధ్య గా పేరు ప్రఖ్యాతలు గడిచిన భద్రాచలంలో ని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కు విచ్చేసి భక్తుల కొరకు ఈ డార్మెటరీ హాల్  నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా భద్రాచలంలోని అమ్మ సత్రం ప్రాంతం వద్ద దేవాదాయ - ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో  రూ 1.50 కోట్ల వ్యయంతో  ‘డార్మెంటరీ జి ప్లస్ వన్ భవన్ ‘ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ  నిర్వహించారు. 

గోదావరి ప రివాహక ప్రాంతాలలో నిర్వహించే గోదావ రి పుష్కరాలకు భక్తులు హాజరవుతారని, ము ఖ్యంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని తెలిపారు. భక్తులకు క నీస వసతులను కల్పించే ఉద్దేశం లో భా గంగా వారి వసతి కొరకు దేవాదాయ శాఖ తరపున ఈ డార్మెటరీ  హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పది రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశం ఈ పుష్కర పనులపై నిర్వహిస్తామని అధికారులు ఇది గమనించి పనిచేయాలని  తెలిపారు.

అనంతరం కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  భద్రాచలం ఈ.ఓ దామోదర్, సర్పంచ్ పూనం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత,వార్డు సభ్యులు రమణ,కారం దుర్గారావు,వాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు