24 August, 2026 | 10:23 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

ఇద్దరు విద్యావేత్తలకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డులు

24-08-2026 09:08 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న అనురాగ్ యూనివర్సిటీకి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లోని మేడన్ ఎక్స్‌పో సెంటర్‌లో  నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రదానం చేసిన డాక్టర్  ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డ్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కు అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యావేత్తలు ఎంపికై అవార్డులు అందుకున్నారు.

అనురాగ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్ మహీపతి శ్రీనివాసరావుకు ఎక్సెంప్లరీ లీడర్ షిప్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్  అవార్డు లభించింది. ఉన్నత విద్యా రంగంలో నాయకత్వం, విద్యార్థుల అభివృద్ధి, విద్యా నాణ్యత, సంస్థాగత పురోగతికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించారు. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్  సోషల్ లెర్నింగ్ డాక్టర్ సి. మల్లేశకు ఎమర్జింగ్ లీడర్ ఇన్ హయ్యర్  ఎడ్యుకేషన్ అవార్డు లభించింది.

విద్యార్థుల్లో జీవిత నైపుణ్యాలు, సామాజిక అవగాహన, అనుభవాత్మక అభ్యాసం, 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ రెండు అవార్డులు అనురాగ్ యూనివర్సిటీ విద్యా నాయకత్వం, నూతన ఆలోచనలు విద్యార్థి-కేంద్రిత అభ్యాసానికి అందిస్తున్న ప్రాధాన్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈసందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు మహీపతి శ్రీనివాసరావు, డాక్టర్ సి. మల్లేశలను అభినందించారు.