అక్రమంగా రవాణా అవుతున్న పశువుల పట్టివేత
అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి నుంచి అక్రమంగా రవాణా అవుతున్న పశువులను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామం నుంచి అక్రమంగా పశువుల రవాణా చేస్తుండగా ఏఎస్ఐ పెంటయ్య ఆధ్వర్యంలో వాహన తనకి నిర్వహిస్తుండగా మినీ వ్యాన్ లో పశువులను తరలిస్తుండగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వాహనదారులను అదుపులో తీసుకొని విచారించగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పశువులను కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా సూర్యపేట పశువుల సంతకు, ఇక్కడి నుంచి హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నట్టు వెల్లడైంది. పశువులను తరలిస్తున్న టీ జి 04 టి 8769 వాహనాన్ని సీజ్ చేసి ఐదు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పశువులను పాల్వంచ గోషాలకు తరలించినట్లు ఏఎస్ఐ తెలిపారు.






